మహేష్ కోసం కూల్ డ్రింక్ సంస్థ ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా ?
Mahesh babu brand ambassador mountain dew soft drink : సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తన టాలెంట్ తో సూపర్ స్టార్ అయ్యాడు. ఓపక్క సినిమాలు చేస్తూ, మరో పక్క యాడ్స్ లో కూడా నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసి లాభాలు అందుకుంటున్నాడు.
ఏఎంబి పేరిట మల్టీ ఫ్లెక్స్ థియేటర్ కూడా హైదరాబాద్ లో నిర్మించి మహేష్ బాబు నిర్వహిస్తున్నాడు. ఇక కోకో కోలా కంపెనీకి చెందిన థమ్స్ అప్ యాడ్ లో కూడా మహేష్ బాబు నటించి అమ్మకాలు పెంచడంలో కీలకంగా వ్యవహరించాడు. అప్పట్లో రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకున్నట్లు టాక్ వచ్చింది.
ఇప్పుడు మౌంటెన్ డ్యూ కూల్ డ్రింక్ ప్రమోషన్ లో కూడా మహేష్ బాబు చేస్తున్నాడు. ఇందుకోసం సదరు కూల్ డ్రింక్ కంపెనీ మహేష్ కోసం కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. క్రేజ్ ఉండగానే సంపాదన పై దృష్టి పెట్టాలని భావించి మహేష్ బాబు వచ్చిన ఛాన్స్ లను వదులుకోకుండా దూసుకెళ్తున్నాడు.