MoviesTollywood news in telugu

పుష్ప సెట్స్ గురించి షాకింగ్ విషయాలు…ఎన్ని సెట్స్ వేశారో తెలిస్తే షాక్…?

Secrets Of Pusha Sets : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా తెరకెక్కిన పుష్ప మూవీ ‘పుష్ప: ది రైజ్‌’ పేరిట మొదటి భాగం రిలీజ్అయింది. ఇప్పటికే ఈ సినిమా అంచనాలతో పాటు ఆసక్తికర విషయాలు కూడా వైరల్ అవు తున్నాయి. ప్రమోషన్స్ హోరెత్తాయి. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ పక్షాన నిర్మించారు.

రంగస్థలం తర్వాత సుకుమార్‌తో పుష్పకి పని చేశాం. ఆయనతో ఒక్కసారి కనెక్ట్‌ అయితే మళ్లీ మళ్లీ పని చేయాలనిపిస్తుంది. సాంకేతిక నిపుణులకు మంచి విలువ ఇస్తారని ఆర్ట్‌ డైరెక్టర్స్‌ రామకృష్ణ, మౌనిక చెప్పారు. ముఖ్యంగా ఎర్రచందనం నేపథ్యంలో సాగే పుష్ప మూవీ కోసం కృత్రిమంగా అడవిని క్రియేట్ చేశారట.

కొన్ని సన్నివేశాలు అడవుల్లో, మరికొన్ని సెట్స్‌లో తీసినా ఏది నిజమైన అడవో? ఏది సెట్టో అనేది ప్రేక్షకులకు తేడా తెలియకూడదని కష్టపడ్డామని, చాలా కష్టంగా అనిపించినప్పటికీ ఆడియన్స్ కి సెట్‌ అనే ఫీలింగ్ రాకుండా సెట్స్‌ వేయడం సవాల్‌గా నిలిచిందని ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పారు.

కరోనా ఎఫెక్ట్ తో కేరళలోని ఓ జలపాతం వద్ద షూటింగ్‌ చేయడానికి వీలు కాలేదని దీంతో ఆ జలపాతం సెట్‌ని కూడా హైదరాబాద్‌లోనే వేశామని ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పారు. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే బన్నీ సెట్స్‌ బాగున్నాయని అభినందించారని తెలిపారు. పుష్ప సినిమా కోసం నిర్మాతల తపన, ధైర్యం వల్లే మొత్తం మీద 25 సెట్స్‌ గ్రాండ్‌గా వేశామని, ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉండాలని వారు పేర్కొన్నారు.