Healthhealth tips in telugu

కోట్లు ఖర్చు పెట్టిన నయంకాని రోగాలను చాలా తేలిగ్గా మాయం చేస్తుంది… ఇది నిజం

Pachi Pasupu Kommu Benefits in telugu : ఆయుర్వేదంలో సుమారు ఐదు వేల ఏళ్ళ నుండీ పసుపుని దాని ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడుతున్నారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. మనలో చాలా మందికి పసుపు పొడి రూపంలోనే తెలుసు. కానీ పచ్చి పసుపు కొమ్మును వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

పచ్చి పసుపులో ఉండే కర్క్యుమిన్ అజీర్ణం మరియు గుండెలో మంటను తగ్గిస్తుంది. పచ్చి పసుపు తీసుకోవడం వల్ల కడుపు పూతలు మరియు చికాకు చికిత్సకు సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రుమటాయిడ్ అర్తరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ రెండింటికీ సంబంధించిన లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది

కంటి ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మంటను తగ్గించడానికి కూడా పచ్చి పసుపు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పచ్చి పసుపులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద వ్యతిరేకంగా పోరాటం చేసి చర్మ ఆరోగ్యంను రక్షిస్తుంది. పచ్చి పసుపు అనేక రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. పచ్చి పసుపులో ఉండే కర్క్యుమిన్ అద్భుతమైన క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది.

పచ్చి పసుపులో ఉన్న అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నివారిణిగా పనిచేస్తాయి. రక్తం గడ్డ కట్టడాన్ని కూడా నియంత్రిస్తుంది. పచ్చి పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలను పర్యవేక్షించడానికి పచ్చి పసుపును ఒక మసాలా వండర్ గా చెప్పవచ్చు.