ఐటెం సాంగ్స్ కి స్టార్ హీరోయిన్స్ అందుకునేది ఎంతో తెలుసా ?
Special songs in tollywood Heroines :గతంలో ఐటెం సాంగ్స్ అదేనండి క్లబ్ సాంగ్స్ వంటివి చేయాలంటే జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత, అనూరాధ వంటి వాళ్ళు ఉండేవారు. రాను రాను స్టార్ హీరోయిన్స్ సైతం ఐటెం సాంగ్స్ వైపు అడుగులు వేయడంతో నిర్మాతలు కూడా, ఆడియన్స్ కూడా స్టార్ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ కి అలవాటు పడ్డారు.
ఇప్పటికే 2నుంచి 5కోట్ల వరకూ అందుకునే స్టార్ హీరోయిన్స్ సైతం స్పెషల్ సాంగ్ పేరిట ఐటెం సాంగ్స్ చేస్తూ, భారీగానే అందుకుంటున్నారు. ఒక్కో స్పెషల్ సాంగ్ కి 30నుంచి 50లక్షల వరకూ వస్తున్నందున స్టార్ హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో ఒప్పేసు కుంటున్నారు.
శ్రేయ టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కి శ్రీకారం చుట్టింది. దేవదాస్, మున్నా, తులసి మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో అలరించింది. కెజిఎఫ్, అల్లుడు శీను, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరూ మూవీస్ లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది. పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ లో కాజల్ అగర్వాల్, జిగేలు రాణి పేరిట రంగస్థలంలో పూజ హెగ్డే స్పెషల్ సాంగ్స్ చేసి అదరగొట్టేసారు. తాజాగా పుష్ప మూవీలో సమంత కూడా చేసిన స్పెషల్ సాంగ్ యూట్యూబ్ లో అదరగొడుతోంది.