ఈ జావ తాగితే…మోకాళ్ల నొప్పులు,నీరసం,అలసట,డయాబెటిస్,చెడుకొలెస్ట్రాల్ లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు
Minapappu Java Benefits in Telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ అలసట,నీరసం,నిస్సత్తువ ఉండి ఏ పని చేయటానికి ఉత్సాహం కానీ ఉషారు కానీ ఉండటం లేదు. ఏ పని చేయాలన్న ఓపిక లేక వాయిదా వేసేస్తూ ఉంటారు. అలాగే మోకాళ్ళ నొప్పులు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయి.
డయబెటిస్ పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది. ఇన్ని సమస్యలు రావటానికి కారణం సరైన జీవనశైలి లేకపోవటం,వ్యాయామం చేయకపోవటం అలాగే calcium లోపం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు calcium లోపం లేకుండా చేసుకోవటమే కాకుండా బలమైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఇప్పుడు మనం ఈ సమస్యలు అన్ని మాయం కావటానికి ఎన్నో పోషకాలు ఉన్న ఒక జావ గురించి తెలుసుకుందాం. దీని కోసం ఒక కప్పు మినపప్పును పొట్టు ఉన్న పప్పు, ఒక కప్పు బియ్యం తీసుకొని వేగించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు. ఈ పొడితో జావ తయారుచేసుకొని ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవచ్చు లేదా సాయంత్రం 4 గంటల సమయంలో అయినా తీసుకోవచ్చు.
ఈ జావను వారంలో 3 రోజులు తీసుకుంటే మోకాళ్ల నొప్పులు,నీరసం,అలసట,డయాబెటిస్,చెడుకొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఏమి లేకుండా ఉషారుగా ఉంటారు. కాస్త ఓపికగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.