బ్రహ్మాస్త్రకు జక్కన్న సమర్పకుడిగా ఎందుకు ఉన్నాడో తెలుసా ?
Bollywood movie brahmastra : బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బ్రహ్మాస్త్ర మూవీని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూ జనవరిలో రిలీజ్ చేయడానికి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు.
ఆర్ ఆర్ ఆర్ పాన్ ఇండియా మూవీగానే వస్తోంది. తెలుగులోనే కాదు మిగిలిన భాషల్లో తీసే చిత్రాలను కూడా ఆయా భాషలలో ఫాన్ ఫాలోయింగ్ ,మార్కెట్ ని దృష్టిలో ఉంచుకుని చాలా వరకూ పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి. ఇక సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర మోషన్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేయగా ఇందులో జక్కన్న చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నాడు.
వచ్చే ఏడాది సెప్టెంబర్ 9న విడుదలయ్యే ఈ మూవీ కోసం చిత్ర బృందం పడుతున్న కష్టాన్ని జక్కన్న ప్రశంసించాడు. ఇదే సందర్భంలో సౌత్ లో ఈ మూవీని జక్కన్న సమర్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సాధారణంగా పెద్ద స్టార్స్, పెద్ద డైరెక్టర్స్ పేర్లను సమర్పకుడిగా వేయడంలో వ్యాపార కోణం కూడా ఉంటుంది.
అందుకే బ్రహ్మాస్త్ర మూవీ సమర్పకుడిగా జక్కన్న పేరు వేయడం వలన సూపర్ హిట్ అయితే 10కోట్లు అందుతుందని, కనీసం ఎంతలేదన్నా రెండు కోట్లు అయినా వస్తుందని టాక్. రణబీర్ కపూర్, అమితా బచ్చన్, అలియా భట్, నాగార్జున, మౌని రాయ్ తదితరులు నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కు తోంది. దాదాపు 4 సంవత్సరాల నుండి నిర్మాణంలోనే ఉంది.