3 సార్లు తాగండి – కీళ్ల నొప్పులు,వెన్నునొప్పి, శారీరక బలహీనత,రక్త హీనత, కాల్షియం లోపం ఉండదు
calcium rich foods In Telugu : ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కాల్షియం లోపం అనేది కనపడుతుంది. కాల్షియం లోపం కారణంగా నీరసం, నిస్సత్తువ వంటివి ఉంటాయి. ఏ పని చేయాలనీ అనిపించదు. అలాగే కీళ్లనొప్పులు,నడుము నొప్పి వంటివి కూడా వస్తాయి. శరీరంలో అలసట మరియు బలహీనత అనుభూతి ఎక్కువగా ఉంటుంది.
రక్తహీనత,నిద్రలేమి సమస్యలు కూడా అధికం అవుతాయి . ఇప్పుడు చెప్పే చిట్కాను వారంలో మూడు సార్లు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయట పడవచ్చు. ఇప్పుడు చెప్పే పాలను తయారుచేసుకోవడం కూడా చాలా సులువు. కాస్త శ్రద్ద,ఓపిక ఉంటే సరిపోతుంది.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక 10 ఫుల్ మఖానలను వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ గసగసాలను వేయాలి. 5 నిమిషాలు మరిగాక దానిలో చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం పాటు మరిగించి గ్లాస్ లో పోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను రాత్రి సమయంలో తీసుకుంటే మంచిది.
ఆహారం తీసుకున్నాక రెండు గంటల తర్వాత పడుకోవటానికి అరగంట ముందు తీసుకోవాలి. వారంలో మూడు రోజులు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకుంటే మీ శరీర బలహీనతను తొలగిస్తుంది, మీ ఎముకలను బలంగా చేస్తుంది మరియు మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది. రక్తహీనత,నిద్రలేమి సమస్యలను కూడా తొలగిస్తుంది.