Healthhealth tips in telugu

వెల్లుల్లిని ఇలా తీసుకుంటే కీళ్లనొప్పులు,గుండెజబ్బులు,అధిక బరువు,అల్జీమర్స్ జన్మలో రావు

Garlic Health benefits In Telugu : సాధారణంగా వెల్లుల్లిని వంటల్లో రుచి,సువాసన కోసం వేస్తూ ఉంటాం. అయితే వెల్లుల్లిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి బరువు తగ్గించటానికి సహాయపడుతుందని మనలో చాలా మందికి తెలుసు. అయితే ఎలా ఉపయోగిస్తే బరువు తగ్గుతామనే విషయం మనలో చాలా మందికి తెలియదు.

వెల్లుల్లిలో విటమిన్ బి 6, విటమిన్ సి , ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్రతి రోజు కొన్ని వెల్లుల్లి రేకలను తింటే జిమ్ కి వెళ్లకుండానే బరువు సులువుగా తగ్గవచ్చు. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వటమే కాకుండా ఎక్కువ కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.

జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు. అనవసరమైన కొవ్వును శరీరం నుంచి బయటకు పంపిచేయటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని ఎక్కువ మొత్తంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేసి క్యాలరీలను కరిగించటంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.

వెల్లుల్లిలో అలిసిన్ ఉంటుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించటానికి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి రేకలను పై తొక్కలు తీసేసి పాన్ లో నూనె లేకుండా వేగించాలి. వీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తినాలి. ఈ విధంగా కొన్ని రోజుల పాటూ చేస్తే ఆ మార్పు మీకు స్పష్టంగా కనపడుతుంది. అయితే రోజుకి రెండు లేదా మూడు వెల్లుల్లి రేకలను మాత్రమే తినాలి.

ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్వచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజు వెల్లుల్లిని ఇలా తీసుకోవటం వలన బరువు తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కీళ్ల నొప్పులు, గుండె సమస్యలు, అల్జీమర్స్ వంటివి ఏమి రాకుండా ఉంటాయి.