MoviesTollywood news in telugu

శ్యామ్‌ సింగరాయ్‌ కోసం నాని ట్రై చేసిన గెటప్స్ ఎన్నో తెలుసా ?

Tollywood Hero Nani shyam singha roy : నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్ మెంట్ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. సాయిపల్లవి, కృతీశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్స్‌ గా నటించిన ఈ మూవీ కోసం నాని పడిన కష్టం చాలా ఎక్కువేనట.

ఈ సినిమా కోసం నాని పడిన కష్టం గురించి చర్చ కూడా నడుస్తోంది. ఎందుకంటే ఏకంగా ఈ మూవీలో లుక్ కోసం 15విభిన్న గెటప్స్ ట్రై చేసాడట. డబుల్ రోల్ చేస్తున్న నాని ఒక గెటప్ లో బెంగాలీ రైటర్ గా కనిపించబోతున్నాడు. మీసాలు, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ మార్చాడు. బొద్దుగా కన్పిస్తున్నా బరువు మాత్రం పెరగలేదు.

ఇక ఈ సినిమాపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా చూసిన ప్రేక్షకులు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారని, ఇలాంటి ఓ మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉందని నాని అంటున్నాడు. కాగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి చివరి పాటలతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రం ఇంకా స్పెషల్‌గా మారిందని, ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని నాని చెబుతున్నాడు.