స్టార్ హీరోలతో నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Tollywood Heroine anu emmanuel : ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అదృష్టం కల్సి రావాలి. లేకుంటే ఎంత బాగా నటించినా ఛాన్స్ లు రాక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. అదే కోవలో హీరోయిన్ అను ఇమ్మానియల్ ని చెప్పుకోవాలి. ఈ అమ్మడు స్టార్ హీరోలతో నటించినప్పటికీ ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది. ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది.
తాజాగా మహా సముద్రం మూవీలో అను చేసింది. శర్వానంద్, సిద్ధార్ధ కల్సి నటించిన ఈ మూవీ కూడా నిరాశపరచడంతో ఛాన్స్ లు రావడం లేదు. నిజానికి ఈ అమ్మడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అను తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త మూవీ కొంచెం పర్వాలేదని పించినా, తర్వాత చేసిన ఆక్సిజన్, మరో తమిళ మూవీ కూడా నిరాశ పరిచాయి.
అయినా ఆతర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసిలో చేసింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడికి తేడా కొట్టింది. అయినా సరే, అల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీలో కూడా ఛాన్స్ దక్కింది. అయితే అది కూడా కల్సి రాలేదు. అలాగే అల్లుడు అదుర్స్, శైలజారెడ్డి అల్లుడు,మూవీస్ కూడా బోల్తా కొట్టాయి. దీంతో ఈ భామకు ఛాన్స్ లు వస్తాయా రాదా అనే సందిగ్ధం నెలకొంది.