99 % కీళ్ల వాతం,కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కీళ్ల మధ్య శబ్దం తగ్గి జీవితంలో అసలు ఉండవు
Joint Pains Home Remedies in Telugu : ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అనేవి 60 ఏళ్ళు వచ్చాక వచ్చేవి. అయితే ఇప్పుడు మారిన జీవనశైలి పరిస్థితులు, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, కాల్షియం లోపం ఉండటం వంటి కారణాలతో చిన్న వయసులోనే ఈ నొప్పులు అన్ని వచ్చేస్తున్నాయి.
నొప్పులు ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. అదే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాను పాటిస్తూ ఇప్పుడు చెప్పే పాలను తాగితే నొప్పుల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ పాలను తయారుచేసుకోవటం చాలా సులువు. కాస్త శ్రద్ద పెడితే చాలు.
చిన్న అల్లం ముక్కను తురమాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కాస్త వేడి అయ్యాక తురిమిన అల్లంను వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఒక సారి బాగా కలిపి గ్లాస్ లోకి వడకట్టి ప్రతి రోజు ఉదయం తాగాలి. ఉదయం సమయంలో తాగటం కుదరని వారు సాయంత్రం తాగవచ్చు.
ఈ పాలను 30 సంవత్సరాలు దాటిన వారు తాగితే చాలా మంచిది. ఈ పాలను తాగటం వలన కీళ్ల వాతం,కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,కీళ్ల మధ్య శబ్దం వంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అంతేకాక శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.