MoviesTollywood news in telugu

జస్టిస్ చౌదరి మూవీని తట్టుకుని నిలబడ్డ మూవీస్ ఎన్నో…?

NTR Justice Chowdary Movie : నటరత్న పద్మశ్రీ ఎన్టీఆర్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్ లో పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబినేషన్ లోనే 1982 మే 28న రిలీజైన జస్టిస్ చౌదరి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. న్యాయానికి కట్టుబడి తీర్పు ఇచ్చే పాత్రలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం ప్రదర్శించారు. ఎన్టీఆర్ డబుల్ రోల్ చేసిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్. విలన్స్ గా కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు నటించారు.

ఆ ఏడాది బొబ్బిలి పులి తర్వాత సెకండ్ హయ్యెస్ట్ గ్రాసర్ గా నిల్చిన జస్టిస్ చౌదరి మూవీకి దగ్గరలో రిలీజైన సినిమాల విషయానికి వస్తే, ఈ సినిమాకు 13రోజుల ముందుగా జంధ్యాల డైరెక్షన్ లో నాలుగు స్తంభాలాట మూవీ రిలీజయింది. నరేష్, పూర్ణిమ, ప్రదీప్ నటించిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుని, నటీనటులకు మంచి పేరు తెచ్చింది.

ఇక జూన్ 11న మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ మూవీ రిలీజయింది. కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతోనే సుధాకర్ ఎంట్రీ ఇచ్చి శుభలేఖ సుధాకర్ అయ్యాడు. జూన్ 12న శోభన్ బాబు నటించిన కోరుకున్న మొగుడు మూవీ వచ్చింది. జయసుధ, శ్రీలక్ష్మి హీరోయిన్స్ గా నటించారు. కట్టా సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏవరేజ్ గా నిల్చింది