ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్…గుర్తు పట్టారా…?
Tollywood Heroine regina cassandra : సోషల్ మీడియాలో ప్రతి రోజూ ఏదో ఒక సెలబ్రిటీకి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రెండు జడలతో అమాయకంగా నవ్వుతూ,స్కూల్ డ్రెస్లో బుద్దిగా ఫోటోకు పోజిస్తున్న ఓ సెలబ్రిటీ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఈమె ఎవరా అని ఆరా తీస్తే, రెజినా గా తేలింది.
అందం, అభినయం గల రెజీనా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ లో శివ మనసులో శృతి’సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే నటనగానూ మంచి మార్కులు దక్కించుకుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సరసన నటించి వరుస హిట్స్ అందుకున్న ఈమె పూర్తిపేరు రెజినా కసండ్రా.
కొత్త జంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, మానగరం తదితర మూవీస్ లో నటించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రానున్న ఆచార్య మూవీలో ఓ ఐటెం సాంగ్ చేస్తోన్న రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో 6 సినిమాల్లో నటిస్తోంది.