Hanuman flag:హనుమంతుని జెండా ఇంటిపై ఎందుకు ఉంచుతారో తెలుసా?
importance of hanuman flag : జెండాపై కపిరాజు అనే పద్యం లోకంలో అందరికీ తెల్సిందే. శ్రీకృష్ణ రాయాభారంలో కౌరవులకు వివరిస్తూ స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పే మాటలను జెండాపై కపిరాజు పద్యాన్ని మన కవులు రాసారు. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథానికి ఆంజనేయుడితో కూడిన జెండా ఉంటుంది.
రావణ సంహారం సమయంలో ఆంజనేయుడి తోడ్పాటు మాములుగా ఉండదు. అందుకే హనుమంతుడు విజయానికి సంకేతం. సాక్షాత్తూ శ్రీ కృష్ణుడే ఆ రథం నడుపుతాడు. రథానికి ఆంజనేయుడితో కూడిన జెండా కట్టమని చెబుతాడు కృష్ణుడు. అందుకే పాండవులకే విజయం దక్కింది.
ఫలితంగా ఆంజనేయుడితో కూడిన జెండా విజయానికి సంకేతంగా భావిస్తారు. మన ఇళ్ళపై ఇలాంటి జెండాలు పెడితే గాలీ ధూళి, భూత పిశాచాలు వంటివి దరిచేరకుండా అందరికీ మంచి జరుగుతుందని అంటారు. పైగా దుష్ట గ్రహాలు దరిచేరవని అంటారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.