భుజాన బ్యాగ్ వేసుకొని వెళుతోన్న ఈ హీరోయిన్ ఎవరో…?
Tollywood actress amala paul : సోషల్ మీడియా విస్తృతి కారణంగా సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవడంతో పాటు వినూత్నమైన ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు ఫాన్స్ కు ప్రశ్నలు కూడా వేస్తున్నారు. తాజాగా అందాల తార అమలాపాల్ కూడా ఇలాంటి ఒక ఫోటో పోస్ట్ చేసింది.
అమలా పాల్ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో ఓ చిత్రంలో నటిస్తోంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఇటీవల ఆహా ఓటీటీ వేదికగా విడుదలైన ‘కుడిఎడమైతే’తో పాటు ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్‌లలో నటించి డిజిటల్ స్క్రీన్‌పై కూడా సత్తా చాటింది.
తాజాగా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టింగ్ లో భుజాన బ్యాగ్ వేసుకొని వెళుతోన్న సమయంలో వెనకాల నుంచి తీసిన ఫోటో ఉంది. అయితే ఇందులో ఉంది అమలా అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఐడీ చూస్తే తప్ప ఆమె ఎవరో గుర్తుపట్టడం కష్టం. అయితే ఈ ఫోటోతో పాటు అమలా పాల్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా రాసింది. తాను ఎదుర్కొంటున్న భయాలకు లేఖను రాస్తున్నట్లు తెలిపిన అమలా.. ‘నేను నిన్ను చూస్తున్నాను, నేను నీ నుంచి నేర్చుకుంటున్నాను, నువ్వు నాకు ఇచ్చిన సలహాలకు ధన్యవాదాలు’ అనే క్యాప్షన్ జతచేసింది.