MoviesTollywood news in telugu

తండ్రి,కొడుకులు కలిసి నటిస్తున్న సినిమాలు ఏమిటో చూడండి

Tollywood Father and sons Movies : సినిమా ఇండస్ట్రీలో తండ్రీ కొడుకులు కల్సి నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. నటరత్ ఎన్టీఆర్, ఆయన కుమారులు హరికృష్ణ, బాలకృష్ణ కల్సి నటించారు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు కల్సి నటించారు. అక్కినేని నాగేశ్వర రావు, నాగార్జున కల్సి నటించారు. అలాగే మనం సినిమాలో అయితే అక్కినేని మూడు తరాల నటులు కల్సి నటించారు.

కొన్ని సినిమాల్లో అయితే కొడుకు నటిస్తే తండ్రి గెస్ట్ రోల్, తండ్రి నటిస్తే కొడుకు గెస్ట్ రోల్ వేసి ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 మూవీలో ఓ సాంగ్ లో రామ్ చరణ్ స్టెప్పులేశాడు. రామ్ చరణ్ నటించిన మూవీలో కూడా చిరంజీవి ఫైటింగ్ సీన్ లో నటించారు.

ఇప్పుడు చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో రామ్ చరణ్ కీలక పాత్ర చేస్తున్నాడు. అలాగే అక్కినేని నాగార్జున, నాగచైతన్య కల్సి బంగార్రాజు మూవీ చేస్తున్నారు. గతంలో భిల్లా సినిమాలో ప్రభాస్ తో కల్సి నటించిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు తాజాగా రాధేశ్యాం మూవీలో గెస్ట్ గా నటిస్తున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ మూవీతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విక్రమ్ కొడుకు ధ్రువ తో కల్సి విక్రమ్ మహాన్ మూవీలో చేస్తున్నాడు.