1 సారి రాస్తే …10 ఏళ్ల నాటి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు కూడా 1 రాత్రిలోనే మాయం అవుతాయి
Joint Pains Oil In Telugu : మోకాళ్ళ నొప్పులు అనేవి ఒకప్పుడు 60 ఏళ్ళు వచ్చాక వచ్చేవి. ప్రస్తుతం 30 ఏళ్ళు వచ్చేసరికి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు వంటివి వచ్చేస్తున్నాయి. నొప్పులు తక్కువగా ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే నూనె రాసుకొని మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. మార్కెట్ లో ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉంటాయి.
అయితే మన ఇంటిలో సహజసిద్దంగా తయారుచేసుకొనే నూనె అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. దీని కోసం 4 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. కాస్త సమయాన్ని కేటాయించి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.
పొయ్యి మీద పాన్ పెట్టి 50 ఎంఎల్ ఆవనూనెను పోసి దానిలో అరస్పూన్ మిరియాలను దంచి వేయాలి. ఆ తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి వేయాలి. ఒక అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఈ మూడు ఆవనూనెలో బాగా వేగే వరకు పొయ్యి మీద ఉంచి ఆ తర్వాత పొయ్యి మీద నుంచి దించి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఈ నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ నూనెలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ నొప్పుల నుండి ఉపశమనం కలిగించటంలో సహాయపడతాయి.