మనసిచ్చి చూడు సీరియల్ తిరుమల రాయుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా ?
Manasichi choodu serial actors In Telugu : స్టార్ మా ఛానల్ లో విజయవంతంగా నడుస్తున్న మనసిచ్చి చూడు సీరియల్ లో నటీనటులు తమ నటనతో, అందంతో అలరిస్తున్నారు. ఇందులో హీరో నాన్న క్యారెక్టర్ లో చేస్తున్న తిరుమల రాయుడు గురించి వివరాల్లోకి వెళ్తే, భార్యామణి సీరియల్ లో చేసాడు. అప్పట్లో ఆ సీరియల్ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. మళ్ళీ మళ్ళీ ఈ సీరియల్ పునః ప్రసారమైనా కూడా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ పొందింది.
అందులో నెగెటివ్ రోల్ చేసిన తిరుమల రాయుడు మనసిచ్చి చూడు సీరియల్ లో పాజిటివ్ రోల్ చేస్తున్నాడు. 1975అక్టోబర్ 14న రేపల్లెలో జన్మించిన తిరుమల రాయుడు అసలు పేరు శ్రీనివాస్. యితడు పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ చేసాడు. రిపోర్ట్రర్ గా ,న్యూస్ రీడర్ గా చేసిన యితడు రేడియో ఖుషికి న్యూస్ చదువుతూ ఇంటర్యూస్ నిర్వహించేవారు.
తెలుగు సంస్కృతి కళావాహిని ప్రయివేట్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ ఓ పక్క యాక్టర్ గా , మరోపక్క జర్నలిస్టుగా, పీఆర్వో గా తన బాధ్యత లను నిర్వహిస్తున్నాడు. ఊసరవెల్లి, ఉల్లాసంగా ఉత్సాహంగా, మిరపకాయ్, దూకుడు వంటి మూవీస్ లో చేసాడు. ఇతడికి పెళ్లయి ఒక బాబు ఉన్నాడు. భార్యామణి, మిస్సమ్మ, ఉయ్యాల జంపాల, రాములమ్మ వంటి పలు సీరియల్స్ లో నటించాడు.