MoviesTollywood news in telugu

హీరోయిన్‌ శ్రియా కట్టిన చీర ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే

sriya saran Saree cost : హీరో హీరోయిన్స్ గురించి ముఖ్యంగా వాళ్ళు కట్టే బట్టలు, వేసుకునే చెప్పులు, వాడే కార్లు, ధరించే వాచీలు ఇలా అన్నింటి గురించి ఫాన్స్ కి తెలిసిపోతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా హీరోయిన్‌ శ్రియా శరన్‌ ధరించిన చీర గురించి ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది.

శ్రియా శరన్‌ ధరించిన చీర సింపుల్ గా ఉండడమే కాకుండా చాలా బ్యూటీగా కన్పిస్తోంది. దీని ఖరీదు అక్షరాలా 44వేలు. ప్రముఖ డిజనర్ ఆనంద్‌ కబ్రా ఈ చీర డిజైన్ చేసాడు. శ్రియా శరన్‌ స్పందిస్తూ, ఖరీదైన దుస్తులు, ఆభరణాలు అందాన్ని పెంచుతాయని, అయితే నిజమైన అందం ఆరోగ్యమే. అందుకే సరైన జీవన శైలి, ఆహారపు అలవాట్లు పాటిస్తే, ఆరోగ్యంగా,అందంగా కనిపిస్తారని చెప్పుకొచ్చింది.

ఇంతకీ డిజైనర్ ఆనంద్‌ కబ్రా వివరాల్లోకి వెళ్తే, 1997లో లండన్‌ యూనివర్సిటీలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేసాక, ఇండియా వచ్చి, 2001లో ముంబైలో ‘ఆనంద్‌ కబ్రా లేబుల్‌’ ఫ్యాషన్‌ హౌస్‌ను ప్రారంభించాడు. తర్వాత సెలబ్రిటీస్‌ ఫేవరెట్‌గా మారింది. యితడు డిజైన్ చేసిన చీరల ధరలు వేల నుంచి లక్షల్లో ఉంటాయి. ఇవి ఆన్ లైన్ లో కూడా లభిస్తాయి. 2006లో హైదరబాద్‌లో జరిగిన ఫ్యాషన్‌ వీక్‌కు యితడు అందించిన 07 కలెక్షన్స్‌ కి మంచి డిమాండ్ వచ్చింది.