దగ్గుబాటి బ్రదర్స్‌ని స్టార్ లను చేసిన సినిమా ఏమిటో తెలుసా?
suresh babu and venkatesh- : తెలుగులోనే కాదు, భారతీయ భాషలన్నిటిలో సినిమాలు తీసిన ఘనత మూవీ మొఘల్‌గా నిర్మాత డి రామానాయుడుకి దక్కుతుంది. ఎందరో డైరెక్టర్స్, హీరోలు, యాక్టర్స్ , ఇలా చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాదు, శతాధిక చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌కెక్కారు.
ఇక ఆయన వారసులుగా సురేష్ బాబు, వెంకటేష్ బ్రదర్స్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పెద్ద కొడుకు సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా, చిన్న కొడుకు వెంకటేష్ హీరో గా సెటిల్ అయ్యారు. అయితే వీరిద్దరినీ టాప్‌లో నిలిపిన మూవీ ఒకటే కావడం విశేషం. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం గల సురేష్ బాబు తండ్రి రామానాయుడుతో కలిసి కథాచర్చల్లో పాల్గొంటూ, నిర్మాతగా ఎలా రాణించాలో మెలుకువలు నేర్చుకున్నారు.
మరోవేపు కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ హీరోగా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ తో నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే మాస్ హీరో ఇమేజ్ మాత్రం రాలేదు. అదే సమయంలో సురేష్ ప్రొడక్షన్ బాధ్యతలు మొత్తం చేపట్టిన సురేష్ బాబు మొదటి సినిమాకి మంచి మాస్ కథని ఎంచుకున్నారు. అదే పరిచూరి బ్రదర్స్ కథ అందించిన బొబ్బిలి రాజా. బి. గోపాల్ దర్శకుడు. జయంత్ సి పరాన్జీ సహాయ దర్శకుడిగా పనిచేశారు.
ఈ సినిమాలో వాణిశ్రీ పోషించిన రాజేశ్వరిదేవి పాత్రకు మొదటగా నటి శారదను అనుకున్నా, సురేశ్ బాబు సూచన మేరకు వాణిశ్రీని సెలెక్ట్ చేసారు. ఇక హీరోయిన్ పాత్రకు కూడా మొదటగా రాధను అనుకున్నారు. కానీ గోపాలకృష్ణ కొత్త అమ్మాయిని తీసుకుందామని ప్రతిపాదించడంతో దివ్యభారతి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడంతో వెంకటేష్ స్టార్ హీరోగా, ముఖ్యంగా ప్రేక్షకుల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. దీనికి సురేష్ బాబు నిర్మాత కావడంతో తొలి సినిమాతోనే సత్తాచాటాడు. మొత్తానికి సురేష్,వెంకీ బ్రదర్స్ కి స్టార్ స్టేటస్ తెచ్చిన సినిమా అయింది.