MoviesTollywood news in telugu

1995 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ కృష్ణ Vs వెంకటేష్…విజేత ఎవరో…?

Krishna and venkatesh : సంక్రాంతి పండగ వస్తోందంటే సినిమాలకు కూడా గిరాకీ. సంక్రాంతి బరిలో పెద్ద స్టార్స్ మూవీస్ తో పాటు చిన్న స్టార్స్ మూవీస్ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇక 1995 సంక్రాంతికి సూపర్ స్టార్ కృష్ణ, విక్టరీ వెంకటేష్ నటించిన చిత్రాలు బరిలో నిలిచాయి. జనవరి 12న అమ్మదొంగా సినిమా రిలీజయింది. కృష్ణ సరసన సౌందర్య, ఆమని, ఇంద్రజ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీకి సాగర్ డైరెక్షన్ చేసారు.

ఎన్నో ఏళ్లుగా కృష్ణ తో సినిమా చేయాలన్న కాంక్షతో ఉన్న సాగర్ ఎట్టకేలకు అమ్మదొంగా మూవీతో ఛాన్స్ దక్కించుకుని, కల నిజం చేసుకున్నారు. ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ కోటి మంచి బాణీలు అందించి, కృష్ణ ఫాన్స్ ని ఫిదా చేసారు.’నీతో సాయంత్రం ఎంతో సంతోషం ..’అనే సాంగ్ ఓ సెన్షేషన్ గా మిగిలింది. 30సెంటర్స్ లో 100డేస్ ఆడి, సూపర్ హిట్ అయింది.

అదేరోజున విక్టరీ వెంకటేష్, రోజా నటించిన పోకిరి రాజా మూవీ వచ్చింది. వెంకీ డబుల్ రోల్ చేయగా, శరత్ బాబు కూడా డబుల్ రోల్ చేసాడు. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దీనికి కూడా కోటి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా బాగున్నా, కథ, కథనం అంతగా ఆకట్టుకోకపోవడంతో ప్లాప్ గా మిగిలింది. దీంతో కృష్ణ నటించిన అమ్మదొంగా విజయంతో విన్నర్ గా నిల్చింది.