ఇలియానా పక్కన ఉన్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా?
Tollywood Heroine ileana : డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరెకెక్కించిన దేవదాసు సినిమాతో రామ్ పోతినేని హీరోగా మారాడు. ఇదే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది గోవా ముద్దుగుమ్మ ఇలియానా. దేవదాసు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ అమ్మడికి మంచి ఛాన్స్ లు వచ్చాయి. పైగా ఇట్టే ఆకర్షించే అందం కూడా ఉండడంతో యూత్ హృదయాలను దోచింది.
తెలుగులో మహేష్ బాబు నటించిన పోకిరి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాటు ఎన్నో హిట్స్ అందుకున్న ఇలియానా బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. బర్ఫీ, పటా పోస్టర్ నిఖలా హీరో, రుస్తుం వంటి బాలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ లో చేసిన ఈమె అక్కడ ఛాన్స్ లు తగ్గడంతో మళ్ళీ టాలీవుడ్ కి వచ్చింది.
ఈ మధ్య సినిమాలకు కొంచెం దూరంగా ఉంటున్న ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ తరచూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఆ మధ్య బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు సెన్షేషన్ క్రియేట్ చేసాయి. తాజాగా తల్లితో దిగిన ఫోటో వైరల్ గా మారింది. కాగా మాస్ మహారాజ్ రవితేజతో కల్సి అమర్ అక్బర్ ఆంటోని తర్వాత మళ్ళీ తెలుగులో ఇలియానా కనిపించలేదు.