MoviesTollywood news in telugu

2021లో భారీ క్రేజ్ తో వచ్చి డిజాస్టర్ గా మిగిలిన సినిమాలు

Tollywood Flops 2021 : మహమ్మారి కరోనాతో ఎన్నో రంగాలు దెబ్బతిన్న వాటిలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన తెలుగు ఇండస్ట్రీకి 2021 తొలి 6 నెలలు బాగానే కలిసొచ్చి, ఊహించని విజయాలు వచ్చాయి. దాంతోపాటు దారుణ పరాజయాలు వచ్చాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా తర్వాత 4 నెలలు గడిచాయి. మళ్లీ చివర్లో కోలుకుంది. ఓవరాల్‌గా 2021లో చూస్తే, చాలా మూవీస్ డిజాస్టర్ అయ్యాయి.

నిర్మాతలను నష్టాల్లో నెట్టాయి. రానా దగ్గుబాటి హీరోగా ప్రభు సాల్మాన్ తీసిన అరణ్య పాన్ ఇండియా మూవీగా వచ్చి అంచనాలు అందుకోలేక పోయింది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన చెక్ భారీ అంచనాలతో వచ్చి దారుణంగా దెబ్బకొట్టింది. అలాగే నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన రంగ్ దే కూడా మొదట్లో పర్లేదనిపించినా..చివరికి ప్లాప్ గా మిగిలింది.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి చావు కబురు చల్లగా మూవీ రిలీజై, దారుణ పరాజయం చవిచూసింది. ఫుల్ రన్‌లో కనీసం 4 కోట్లు అయినా రాబట్టలేకపోయింది. సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన కపటధారి సినిమా ట్రైలర్ ఆసక్తి కలిగించినా సినిమా నిరాశపరిచింది.

అల్లరి నరేష్ హీరోగా కొత్త దర్శకుడు పివి గిరి తీసిన బంగారు బుల్లోడు మూవీ అసలు రిలీజైనట్లు కూడా తెలీదు. అంత దారుణంగా దెబ్బకొట్టింది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాను సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించగా, సంక్రాంతికి వచ్చి, పరాజయం పాలైంది. శ్రీవిష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన గాలి సంపత్ మూవీపై ఆసక్తి ఉన్నా, నిరాశ పరిచింది.

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ జంటగా హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్‌ మూవీ మోసగాళ్లు కనీసం కోటి రూపాయల షేర్ రాబట్టలేదు. కొత్త దర్శకుడు అసిషోర్ సోలోమన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన వైల్డ్ డాగ్ చిత్రానికి టాక్ బాగానే వచ్చినా కూడా కలెక్షన్స్ దెబ్బ కొట్టాయి. విశ్వక్ సేన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పాగల్ సినిమాపై రిలీజ్‌కు ముందు మంచి అంచనాలున్నాయి.

పైగా ప్రీ రిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్ కూడా సినిమా గురించి ఓ రేంజ్‌లో పొగిడేస్తూ,ఇది కానీ హిట్ కాకపోతే తన పేరు మార్చుకుంటానని, శపథం చేసాడు. కానీ ఈ మూవీ అసలు ఎప్పుడు వచ్చిందో కూడా ఆడియన్స్‌కు తెలీదు. ఆది సాయి కుమార్‌ ఈ ఏడాది శశి మూవీతో వచ్చి మరో ప్లాప్ మిగుల్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరోగా నటించిన తెల్లవారితే గురువారం ఏమాత్రం అక్కట్టుకోలేదు.

చివరకు ఫ్లాప్ గా మిగిలింది. శర్వానంద్‌కు శ్రీకారం మూవీ షాకిచ్చింది. పాజిటివ్ టాక్‌తో ఓపెన్ అయినప్పటికీ కేవలం 9.41 కోట్ల షేర్ మాత్రమే తెచ్చింది. అవసరాల శ్రీనివాస్ హీరోగా, రచయితగా నూటొక్క జిల్లాల అందగాడు మూవీని దిల్ రాజు నిర్మించాడు. దీంతో అంచనాలు బాగానే ఉన్నా, సినిమా డిజాస్టర్ అయింది. ఉప్పెన లాంటి సెన్షేషనల్ హిట్ తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన కొండ పొలం మూవీ ట్రైలర్ విడుదల తర్వాత భారీ బిజినెస్ జరిగింది.

క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం విడుదల తర్వాత కేవలం ప్రశంసలు వచ్చినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా విడుదలకు ముందు చాలా సందడి చేసినప్పటికీ సినిమా నిరాశ పరిచింది. అయితే ఓటిటిలో మంచి ఆదరణ పొందింది.

సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయిన తర్వాత బెడ్డు మీద ఉన్నపుడే థియేటర్స్‌లోకి విడుదలైన మొదటి సినిమా రిపబ్లిక్ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో వీకైంది. స్పోర్ట్స్ నేపథ్యంలో నాగశౌర్య హీరోగా వచ్చిన లక్ష్య దారుణ పరాజయం పాలైంది. ఈ సినిమా కోసం 8 ప్యాక్ కూడా చేసిన శౌర్యకి ఫలితం దక్కలేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన మహా సముద్రం భారీ అంచనాలతో దసరాకు విడుదలై, నిరాదరణకు గురైంది.