MoviesTollywood news in telugu

బాలకృష్ణ,మంజుల హీరో,హీరోయిన్ గా సినిమా మొదలై ఎందుకు ఆగిపోయింది

Bala Krishna Movie : సినిమా హీరోలను అభిమానించి ఆదరించే ఆడియన్స్ వాళ్ళ కొడుకులను హీరోలుగా ఒప్పుకుంటారు తప్ప, కూతుళ్లను అసలు హీరోయిన్స్ గా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండలేరు. కుటుంబ సభ్యులుగా భావించడం వలన అభిమానులు ఇలా వ్యవహరిస్తుంటారు. తమ అక్కా చెల్లిలా భావించే హీరోల కూతుళ్లను వేరేవాళ్లతో డ్యూయెట్స్ పాడడం లాంటివి ఫాన్స్ అసలు ఒప్పుకోలేరు. ఫాన్స్ దెబ్బకు ఎంతటి స్టార్ హీరో అయినా తమ నిర్ణయం మార్చుకుని తీరాల్సిందే.

ఇప్పుడైతే మెగా డాటర్ నిహారిక , డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక లాంటి వాళ్ళు హీరోయిన్స్ గా వస్తున్నారు కానీ, ఒకప్పుడు ఫాన్స్ మాత్రం ససేమిరా అనేవారు. అలా సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజులను ఫాన్స్ హీరోయిన్ గా ఒప్పుకోలేదు. కానీ ఆమెకు హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. తండ్రికి విషయం చెబితే ముందు కొంచెం తటపటాయించినా, ఆతర్వాత ఒకే చెప్పారు. పద్దతిగా సినిమాలు తీసే ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి మంచి హీరోయిన్ గా లాంచ్ చేయాలని చెప్పేసారు.

దాంతో కృష్ణారెడ్డి ఒకే చెప్పేసారు. అప్పటికే బాలకృష్ణను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో బాలయ్య పక్కన హీరోయిన్ గా పెట్టాలని కూడా కృష్ణారెడ్డి అనుకున్నారు. బాలయ్య కూడా ఒకే చెప్పడంతో టాప్ హీరో మూవీ 1994లో ప్రకటన చేసారు. విషయం తెల్సిన ఫాన్స్ రచ్చ చేసారు. కృష్ణా , గుంటూరు, కాకినాడ ఇలా వివిధ ప్రాంతాల నుంచి ఫాన్స్ హైదరాబాద్ వెళ్లి పద్మాలయ స్టూడియో ముందు పెద్ద గొడవ చేసేసారు. ఫాన్స్ కి కృష్ణ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దాంతో మంజులకు విషయం చెప్పడంతో ఫాన్స్ మనోభావాలకు అనుగుణంగా మంజుల తన నిర్ణయం మార్చుకుంది. తన కూతురు యాక్ట్ చేయడం లేదని కృష్ణ స్వయంగా పత్రికా ప్రకటన చేయడంతో ఫాన్స్ శాంతించారు. చేసేది లేక మంజుల స్థానంలో సౌందర్యను తీసుకుని ఎస్వీ కృష్ణారెడ్డి టాప్ హీరో మూవీ చేసారు.