MoviesTollywood news in telugu

బిగ్‌బాస్‌ ఓటీటీలో కీలక మార్పులు…ఏమిటో చూడండి

Bigg Boss Telugu : హాలీవుడ్‌లో పుట్టిన బిగ్‌బాస్‌ రియాలిటీ షో అన్ని భాషలకు విస్తరించి తెలుగు బుల్లతెర ప్రేక్షకులకు కూడా పరిచయం చేసింది. అంతేకాదు, ఏకంగా ఐదు సీజన్స్ పూర్తిచేసుకుంది. ఓపక్క విమర్శలు వస్తున్నా సరే, ఈ షోకి జనాలు కనెక్ట్ అవ్వడం అదే రేంజ్ లో ఉంది. అందుకే ఈ షో తెలుగులో టీఆర్‌పీ రేటింగ్స్‌ అదరగొట్టేస్తోంది. తాజాగా బిగ్‌బాస్‌ ఓటీటీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ గా మారింది.

నిజానికి ఇటీవల 5వ సీజన్‌లో విన్నర్‌గా సన్నీని ప్రకటించిన వెంటనే హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ కేవలం 2 నెలల్లోనే బిగ్‌బాస్‌ మళ్లీ ఆడియన్స్ ముందుకు వస్తుందని ప్రకటించాడు. ఇదేమిటి అనుకునేలోగా 2 నెలల్లో వచ్చేది రెగ్యులర్‌ బిగ్‌బాస్‌ కాదని, ఓటీటీ వేదికగా వచ్చే బిగ్‌బాస్‌ అని నిర్వాహకులు స్పష్టత ఇచ్చారు.

అంతేకాదు, హిందీలో వచ్చిన మాదిరిగానే 24*7 టెలికాస్ట్‌ చేయనున్నట్లు, నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు కూడా నిర్వాహకులు ప్రకటించారు. కాగా బిగ్‌బాస్‌ ఓటీటీ నిర్వాహణ బాధ్యతను ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ సంస్థ అయిన ‘ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’కు అప్పజెప్పనున్నట్లు టాక్.

దీన్ని బట్టి ఓటీటీలో ప్రసారమయ్యే ఎపిసోడ్స్‌ బాధ్యత ఓంకార్‌దే అని తెలుస్తోంది. హిందీలో కూడా బిగ్‌బాస్‌ రెగ్యులర్‌ షోకి సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తే.. ఓటీటీకి కరణ్‌ జోహర్‌ హోస్ట్‌గా చేసిన నేపథ్యంలో తెలుగులో మాత్రం హోస్ట్‌గా నాగార్జున ఉంటాడని సమాచారం.