దగ్గు, జలుబును తగ్గించి జీవితంలో రాకుండా..5 సంవత్సరాల పిల్లల నుండి 70 సంవత్సరాల ముసలివారి వారి వరకు
Cold Home Remedies in telugu : విపరీతమైన మంచు కారణంగా చాలా తొందరగా దగ్గు,జలుబు,గొంతు నొప్పి వచ్చేస్తున్నాయి. ఇవి రాగానే చాలా తొందరగా తగ్గే మార్గం చూడాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ చిన్న అనారోగ్యానికీ టాబ్లెట్లు వేసేసుకుంటే… మన బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది.
అందువల్ల శరీరానికి మందులు అలవాటు చేయకుండా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా దగ్గు,జలుబును ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. కాస్త శ్రద్ద సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. పాన్ లో ఒక స్పూన్ లవంగాలు, ఒక స్పూన్ మిరియాలు వేసి వెగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని నిల్వ చేసుకోవచ్చు.
రెండు అంగుళాల అల్లం ముక్కను రసం తీసుకోవాలి. ఈ రసంలో లవంగాలు,మిరియాల పొడి పావు స్పూన్ లో సగం వేసి బాగా కలపాలి. దీనిలో అరస్పూన్ తేనె కలిపి ఒక స్పూన్ ఉదయం ఒక స్పూన్ సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా రెండు రోజులు తీసుకుంటే సరిపోతుంది. చిన్న పిల్లలు అయితే అరస్పూన్ ఇవ్వాలి.
లవంగాలు,మిరియాలలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబు,తలనొప్పిని ఎదుర్కోవడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అల్లంలోని ఎథనాలిక్ పదార్ధాలు శరీరంలో మలినాలను తొలగించటానికి సహాయపడతాయి.