1 గ్లాస్ తాగితే చాలు ఎంత కొవ్వు అయినా మైనంలా కరిగిపోతుంది
sabja seeds Weight Loss Tips In telugu : మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో అధిక బరువు సమస్య చిన్న వయస్సులోనే ప్రారంభం అవుతుంది. ఆలా పెరిగిన బరువును తగ్గించుకోవటం కూడా చాలా కష్టం అవుతుంది. శరీరంలో అధికంగా పేరుకుపోయే కొవ్వును కరిగించేందుకు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.
శరీరంలో కొవ్వు కరిగి బరువు తగ్గటానికి వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే డ్రింక్ త్రాగితే చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గవచ్చు. ఈ డ్రింక్ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవి అన్నీ మనకు ఇంటిలో అందుబాటులో ఉండేవే. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఒక గ్లాస్ లో ఒక స్పూన్ సబ్జా గింజలను వేసి దానిలో నీటిని పోసి ఒక గంట అలా వదిలేయాలి. అలా వదిలేస్తే సబ్జా గింజలు నాని ఉబ్బుతాయి. ఇప్పుడు దీనిలో అరచెక్క నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఈ డ్రింక్ ని ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగవచ్చు. ఈ డ్రింక్ తాగటానికి అరగంట ముందు కడుపు ఖాళీగా ఉండాలి.
కొంతమంది వారంలో 7 కేజీలు బరువు తగ్గచ్చు అని చెప్పుతూ ఉంటారు. కానీ ఆలా సాధ్యం కాదు. ఒక్కసారిగా అంత బరువు తగ్గకూడదు. నిదానంగా బరువు తగ్గే విధానం చూస్కోవాలి. ఇప్పుడు చెప్పే డ్రింక్ త్రాగితే నెల రోజుల్లోనే మీకు తేడా కనపడుతుంది. దానిని బట్టి మీరు ఇంకా ఎన్ని రోజులు త్రాగితే బెటర్ అనే విషయం అర్ధం అవుతుంది.