MoviesTollywood news in telugu

రమేష్ బాబు భార్య,పిల్లలు గురించి ఈ విషయాలు తెలుసా?

Ramesh babu wife and children details : గత కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌ బాబు అన్నయ్య ఘట్టమనేని రమేశ్‌ బాబు 56 ఏళ్ల వయసులో శనివారం రాత్రి కన్నుమూయడం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. 1965, అక్టోబర్‌ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు తొలి సంతానంగా జన్మించిన రమేశ్‌ బాబు అల్లూరి సీతారామరాజు సినిమాలో చిన్నప్పటి రామరాజుగా చేసి వెండితెరకు పరిచయం అయ్యాడు.

అలాగే ఎన్టీఆర్ తో కల్సి నటించి, కృష్ణ స్వయంగా నిర్మించిన దేవుడు చేసిన మనుషులు మూవీలో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా రమేష్ కనిపించాడు. కొన్ని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసి, సామ్రాట్‌ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 15మూవీస్ లో చేసాడు. తర్వాత మహేష్ బాబు హీరోగా పలు సినిమాలను నిర్మించాడు. అయితే రమేష్ నిర్మించిన అతిధి వంటి మూవీస్ దెబ్బతిన్నాయి.

ఇక వ్యక్తిగత విషయానికి వస్తే, రమేష్ బాబుకి భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ని ఫంక్షన్స్ కి తీసుకెళ్లిన దాఖలాలు లేవు. కాగా రమేష్ బాబు మరణాన్ని కృష్ణ జీర్ణించుకోలేక చలించిపోయారు. ఇక కరోనా కారణంగా మహేష్ బాబు హోమ్ ఐసోలేషన్ లో ఉండడంతో కడసారి చూపు సైతం దక్కకపోవడంతో ఎమోషన్ ట్వీట్ చేసాడు.