‘ఆంధ్రావాలా’ సినిమా గురించి షాకింగ్ విషయాలు చెప్పిన ఎన్‌టిఆర్
Ntr andhrawala movie : జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ హీరోగా స్టేటస్ అందుకున్న రోజుల్లో పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో చేసిన ఆంధ్రావాలా మూవీ భారీ లంచాలతో వచ్చి నిరాశ పరిచింది. 2004జనవరి 1న రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ప్రొడ్యూసర్ చాలా నష్టపోవాల్సి వచ్చింది.
రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్రావాలా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కి 10లక్షల మంది ఫాన్స్ హాజరయ్యారు. ఏకంగా 10రైళ్లు ఫాన్స్ కోసం ఏర్పాటుచేసారట. ఈ విషయాన్ని ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్ లో భాగంగా తారక్ స్వయంగా వెల్లడించడం విశేషం.
అయితే ఇదే సినిమా కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిస్తే బ్లాక్ బస్టర్ అవ్వడం మరో విశేషం. ఇక సాయాజీ షిండే, రాహుల్ దేవ్ కీలక పాత్రలు పోషించిన ఆంధ్రావాలాలో తారక్ సరసన రక్షిత హీరోయిన్ గా చేసింది. మొదటి భాగం సినిమా బాగుందని, సెకండాఫ్ ఆకట్టుకోలేదని అప్పట్లో తేల్చారు.