హలో బ్రదర్ మూవీ గురించి ఇంటరెస్టింగ్ విషయాలు…నమ్మలేని నిజాలు
ఏదైనా ఒక మూవీ క్లాసిక్ గా గానీ, మాస్ మూవీగా గానీ, కామెడీ మూవీగా గానీ, ఓ ప్రత్యేక గుర్తింపుగా గానీ నిలబడే సూచనలు ఉంటాయి. అయితే ఈ అంశాలన్నీ ఉన్న సినిమా కూడా ఉంటుంది. ఇలాంటి అద్భుత మూవీస్ వేళ్ళమీద లెక్కెట్టవచ్చు. అందులో హలో బ్రదర్ మూవీ ఒకటి. 1993లో వారసుడు మూవీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో నాగార్జునను అభినందించడానికి డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ వెళ్ళాడు. ఇంకో మూవీ రెడీ చేయమని నాగ్ చెబుతూ, అక్టోబర్ నుంచి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద చేద్దామని అన్నాడు. ఓ పక్క సినిమా హిట్ అయిన ఆనందం,మరోపక్క ఇంకో సినిమా అంటే నాగ్ ని ఎలా చూపించాలనే టెన్షన్ చుట్టుముట్టాయి. అయితే ఎల్బీ శ్రీరామ్ ని సలహా అడగడంతో కామెడీ టచ్ తో సినిమా చేయమని సలహా ఇచ్చాడట.
దీంతో స్టోరీ ఐడియా వచ్చేసింది. హాలీవుడ్ మూవీ ట్విన్ డ్రాగన్స్ కథ స్పూర్తితో తీయాలని ఎప్పటినుంచో ఈవివికి కోరికగా ఉండేది. రమణి,ఎల్బీ శ్రీరామ్ సహకారంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. నాగ్ ఒప్పుకోవడంతో సౌందర్య, రమ్యకృష్ణలను సెలెక్ట్ చేసి,సినిమా స్టార్ట్ చేసారు. 2న్నర కోట్ల బడ్జెట్ తో సినిమా పూర్తిచేసారు. అయితే టైటిల్ విషయంలో ఇద్దరు బ్రదర్స్ అనుకున్నారట. చివరకు హలో బ్రదర్స్ ఫిక్స్ చేసేసారు. అప్పటికే గోవిందా గోవిందా ప్లాప్ అవ్వడంతో మూవీపై హైప్ తగ్గించాడు. ఏప్రియల్ 1969లో 69ప్రింట్స్ తక్కువ ప్రింట్లతో విడుదల చేసారు. నాగ్ డబుల్ రోల్ మూవీ కావడంతో జనం ఆసక్తిగా థియేటర్స్ కి వెళ్లి,కొత్త అనుభూతి పొందారు.
ఎందుకంటే కవలలిద్దరూ ఒకేలా ప్రవర్తించడం ఇండియన్ స్క్రీన్ మీద లేదు. కామెడీ అదిరింది. దీంతో అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించింది. ప్రియరాగాలే వంటి సాంగ్స్ సూపర్ హిట్. ఇక ముగ్గురు హీరోయిన్స్ తో కన్నె పెట్టారో కన్నుకొట్టరో సాంగ్ అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్. నాగ్ డ్యూల్ రోల్ లో అదరగొట్టాడు. మొదటి వరం కోటికి పైగా వసూలు చేసింది. 70కేంద్రాల్లో 50రోజులు,24కేంద్రాల్లో 100రోజులు ఆడింది. 100రోజులకు 8.5కోట్ల షేర్ రాబట్టింది. అప్పట్లో హయ్యస్ట్ షేర్ . అయితే ఇండస్ట్రీ హిట్ ని తృటిలో మిస్సయింది. హైద్రాబాద్ దేవి థియేటర్లో 30రోజులు 120 హౌస్ ఫుల్ షోలతో ఇండియా రికార్డ్ కొట్టింది. ఇప్పటికీ 670షోస్,100రోజులతో కడపలో ఈ మూవీ రికార్డ్ అలాగే నిలబడింది. గాజువాకలో తొలిసారి 100రోజులు ఆడిన సినిమా ఇదే. తమిళంలో డబ్ చేయగా,అక్కడా హిట్ కొట్టింది.