ఈ దుంపలను తింటున్నారా…ఈ విషయాలు తెలిస్తే అసలు నమ్మలేరు
Potato sprouts : బంగాళాదుంప అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. బంగాళాదుంపతో వేపుళ్ళు,కూర,చిప్స్,మసాలా గ్రేవీలు వంటివి చేసుకుంటారు. మనం ఒక్కోసారి బంగాళాదుంపలు చవకగా వస్తున్నాయని ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటాం. అలాంటి సమయంలో బంగాళా దుంపలకు మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన బంగాళదుంపలను తినవచ్చా…లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
మొలకెత్తిన బంగాళాదుంపలో ఉండే పిండి పదార్ధం చక్కెరలుగా మారుతుంది. ఆకుపచ్చ లేదా మొలకెత్తిన బంగాళాదుంపలు తినడం ప్రాణాంతకం కాదు, కానీ కొన్ని పరిస్థితులలో బంగాళాదుంపలు కొద్దిగా విషపూరితంగా ఉంటాయి. బంగాళాదుంప మొలకలు వచ్చినప్పుడు బంగాళాదుంపలో ఉండే పోషకాలు మొలకల కోసం ఉపయోగపడతాయి.
అందువల్ల బంగాళాదుంప మొలకలను తీసేసి కూరగా చేసుకున్న మాములు బంగాళాదుంపతో పోలిస్తే పోషకాలు తగ్గుతాయి. రుచిలో కూడా కాస్త తేడా వస్తుంది. బంగాళాదుంప మొలకలలో సోలనిన్ మరియు గ్లైకోకాల్లాయిడ్లు ఉంటాయి. ఇవి కొంత విషపూరితమైనవి. వీటి ప్రభావం తీవ్రంగా లేనప్పటికీ మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినటం వలన పొట్ట అప్సెట్ మరియు జీర్ణ సమస్యలు,తలనొప్పి,వాంతులు,వికారం, విరేచనాలు, గొంతు మంట,మైకం వంటివి వస్తాయి.
అందువల్ల బంగాళాదుంపలు కొనే ముందు మొలకలు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ మొలకలు ఉంటే మొలకలు తీసేయటం మరియు బంగాళా దుంపను ఉడికించి ముందు తొక్కను తీసేసి ఉడికించాలి. బంగాళాదుంపల మీద ఆకుపచ్చని రంగు పాచెస్ ఉంటే వండటానికి ముందే వాటిని కట్ చేయాలి. బంగాళాదుంప మొలకలు వచ్చినప్పుడు బంగాళాదుంప గట్టిగా ఉంటే తినవచ్చు. కానీ బంగాళాదుంప కుంచించుకుపోయి,ముడతలు పడి, మొలకలు ఉంటే మాత్రం అసలు తినకూడదు.
https://www.chaipakodi.com/