MoviesTollywood news in telugu

యాంగ్రీ యంగ్ మ్యాన్, కలెక్షన్ కింగ్ వదిలేసుకున్న హిట్ సినిమా ఏమిటో తెలుసా?

mohan babu and rajasekhar : కొన్ని సినిమాలు కొందరిని దృష్టిలో ఉంచుకుని కథలు రాస్తారు. తీరా వాళ్ళు కుదరకపోతే వేరేవాళ్లను పెట్టి కొద్దిపాటి మార్పులతో సినిమా తెర కెక్కిస్తుంటారు. ఇలా చాలా సందర్భాల్లో జరిగాయి. అయితే ఆ సినిమా హిట్ అయినపుడు వదిలేసుకున్న వాళ్లకు అయ్యో అన్పిస్తుంది. ఇక హనుమాన్ జంక్షన్ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది.

నిజానికి ఈ సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేయాల్సి ఉంది. అడ్వాన్స్ తీసుకుని కూడా వేరే కారణాల వలన ఇద్దరూ తప్పుకున్నారు. దాంతో జగపతి బాబు, అర్జున్ ఎంట్రీ ఇచ్చి, యాక్ట్ చేసారు. తెన్ కాశి పట్టణం అనే మలయాళీ మూవీ ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ మూవీలో స్నేహ, లయ హీరోయిన్స్ గా చేసారు.

ప్రస్తుతం మెగాస్టార్ హీరోగా గాడ్ ఫాథర్ మూవీ డైరెక్ట్ చేస్తున్న ఎం మోహన్ రాజా ఇటీవల ఓ ఇంటర్యూలో ఈ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తెన్ కాశి పట్టణం మూవీ లో ఓకే అంశాన్ని తీసుకుని కొద్దిపాటి మార్పులతో హనుమాన్ జంక్షన్ గా తీసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ మూవీ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చినా తెలుగులో మోహన్ రాజా మూవీ చేయలేదు