RRR సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా?
RRR Movie : దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ వ్యయంతో తీసిన ఆర్ఆర్ఆర్. ఈ మూవీ రిలీజ్ వాయిదా పడడం ఫాన్స్ నే కాదు, ఆడియన్స్ ని కూడా నిరుత్సాహ పరిచింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా నిజానికి జనవరి 7న రిలీజ్ డేట్ ప్రకటించి, భారీగా ప్రమోషన్ వర్క్ కూడా మొదలెట్టారు. అయితే దేశంలో ఓమిక్రాన్, కరోనా విజృంభణ కారణంగా కొన్ని రాష్ట్రాల్లో 50% ఆడియన్స్ తో థియేటర్లకు అనుమతి ఇస్తున్నారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్ వివాదం నెలకొనడంతో ఆర్ఆర్ఆర్ సినిమాను చిత్ర నిర్మాతలు వాయిదా వేసేసారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తోడు జక్కన్న పక్కా ప్లాన్ తో హిందీ, తమిళ్, కన్నడ అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కూడా భారీగా చేసాడు.
ప్రెస్ మీట్స్ పెట్టి అదరగొట్టేసాడు జక్కన్న. తీరా చూస్తే రిలీజ్ వాయిదా పడింది. ఇక ప్రమోషన్స్ కోసమే జక్కన్న 20కోట్లు ఖర్చు చేసినట్లు ఫిలిం వర్గాల అంచనా. అయితే అంతలేదని, కేవలం ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని మరికొందరి వాదనగా వినిపిస్తోంది. మొత్తం మీద ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెగా, నందమూరి ఫాన్స్ కి కూడా నిరాశ మిగిల్చింది.