2021 లో నటనతో ఆకట్టుకున్న నటీనటులు ఎవరో ఒక లుక్ వేయండి
2021 Best Performers : సినిమాకు హీరో హీరోయిన్స్, విలన్ ఎంత ముఖ్యమో ఇతరక్యారెక్టర్స్ కి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. హీరోగా చేసి, విలనిజం పండించడం, క్యారెక్టర్ యాక్టర్ గా చేయడం కూడా చేస్తున్నారు. 2021లో ఇలా చాలామంది విభిన్న పాత్రలతో అలరించారు. ముఖ్యంగా నటుడు శ్రీకాంత్ ఒకప్పుడు విలన్, క్యారెక్టర్ యాక్టర్ గానే చేసి హీరో అయ్యాడు.
అయితే బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన అఖండ మూవీలో విలన్ గా చేసి మెప్పించాడు. అంతకుముందే మలయాళం మూవీ యుద్ధం శరణం గచ్ఛామి లో కూడా విలనిజం పండించాడు. అలాగే జగపతి హీరోగా ఛాన్స్ లు తగ్గడంతో విలన్ గా చేస్తూ వస్తూ, సడన్ గా రిపబ్లిక్ మూవీలో ప్రభుత్వ అధికారి పాత్రలో చేసి మెప్పించాడు.
విలనిజం పండించే అజయ్ ఘోష్ ‘పుష్ప’ మూవీలో కొండారెడ్డి పాత్రలో అదరగొట్టాడు. అయితే దీనికి భిన్నంగా మంచిరోజులొచ్చాయి మూవీలో తాను భయపడుతూ నవ్వించిన తీరు సైతం కొత్తగా ఉంది. ఇక పుష్పలో అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో జగదీశ్ నటన అదరగొట్టాడు. నటుడు హర్ష వర్ధన్ పుష్పక విమానం మూవీలో పావుగంట సేపు నటించినా, జీవించేసాడు. నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి హీరోయిన్ గా చేస్తూ మరో పక్క విలన్ గా ఎంట్రీ ఇచ్చి, తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తోంది.
క్రాక్, నాంది మూవీస్ లో ఆమె నటన హైలెట్. ఇక వరుస విలనిజం పాత్రలు చేస్తూ వస్తున్న రావు రమేష్ శ్రీకారం మూవీలో తండ్రి పాత్రలో రైతుగా అదరగొట్టేసాడు. జి 5లో బట్టల రామస్వామి బయోపిక్ మూవీ కామెడీ పండించింది. ఇందులో అల్తాఫ్ హస్సన్ నటన ఆకట్టుకుంది. విక్టరీ వెంకటేష్ నారప్ప మూవీలో వెంకీతో సమానంగా పెద్ద కొడుకు పాత్రలో కార్తీక్ రత్నం తన హావభావాలతో అదరగొట్టేసాడు.
రాజరాజ చోర మూవీలో సునైన నటన సూపర్భ్. హీరోయిన్ గానే చేసే ఈమె ఈ మూవీలో భార్యగా, తల్లిగా మంచి నటన ప్రదర్శించింది. ఈ మధ్య వరుస సినిమాలు చేస్తున్న ఒకప్పటి విప్లవ నటుడు సాయిచంద్ తాజాగా కొండపోలం మూవీలో గొర్రెల కాపరిగా చేసిన నటన ఆకట్టుకుంటుంది. క్యారెక్టర్ యాక్టర్ నుంచి హీరోగా ఎదిగిన సత్యదేవ్ నటించిన స్కైలాబ్ మూవీలో డాక్టర్ గా చేసిన నటన అదుర్స్. అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈశ్వరరావు చేసిన నటన చూసి లవ్ స్టోరీ లో ఇచ్చిన దళిత మహిళ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసింది.