Healthhealth tips in telugu

ఎంత రక్తం కావాలో అంత రక్తాన్ని ఇచ్చే ఆకుకూర…రక్తహీనత అసలు ఉండదు

Parsley Tea Benefits : పార్స్‌లీ ఆకులు చూడటానికి కొత్తిమీర మాదిరిగా ఉంటాయి. కానీ కొత్తిమీర పార్స్‌లీ ఆకులకు సంబంధమే లేదు. ఈ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పార్స్‌లీ ఆకులు మనకు బయట దొరకవు. కాబట్టి ఈ ఆకులను మనం ఉపయోగించాలంటే టీ పొడి,టీ బ్యాగ్స్ వంటివి సూపర్ మార్కెట్లోనూ, ఆన్లైన్ స్టోర్ లోను దొరుకుతాయి.

కాబట్టి పొడి కొనుక్కొని టీ తయారుచేసుకొని తాగితే వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకులలో ఐరన్ సమృద్దిగా ఉండుట వలన రక్తప్రసరణ మెరుగుపరచటానికి మరియు రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఐరన్ కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్ మరియు మరమ్మత్తు కోసం పోషకాలు అవసరమైన కణాలకు ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకురావడాన్ని ప్రోత్సహిస్తాయి. పార్స్లీ టీలో విటమిన్ సి మరియు కాల్షియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు పోషకాలు కూడా శరీరం ఐరన్ ను గ్రహించడంలో సహాయపడతాయి.

ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ పార్స్‌లీ టీ పొడి వెయ్యాలి. ఐదు నిమిషాల పాటు సిమ్ లో మరగనివ్వాలి. ఆ తర్వాత ఫిల్టర్ చెయ్యాలి. ఇప్పుడా పార్స్‌లీ టీలో అరస్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఈ టీ తాగటం వలన శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దయబెటిస్ ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నావరు తేనె లేకుండా తాగాలి.