Healthhealth tips in telugu

4 ఆకులు – సయాటికా నొప్పి, నరాలలో సమస్యలు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు మాయం అవుతాయి

sciatica Pain Home Remedies : వెన్నునొప్పి, సయాటికా సమస్య ఉన్నాయంటే చాలా విపరీతమైన బాధ ఉంటుంది. ఒక్కసారి వచ్చాయంటే తగ్గించుకోవటం చాలా కష్టం. ఇప్పుడు చెప్పే రెమిడీ 15 రోజులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. సయాటికా అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో వస్తుంది.
parijat leaves
ఈ నొప్పి ఉన్నప్పుడు రోజువారీ పనులను చేసుకోవటానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే ఫిజియోథెరపీ, యోగ వంటివి చేస్తూ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. అయితే ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. నొప్పి, సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అవవచ్చు.

ఈ సమస్య పరిష్కరానికి పారిజాతం పనిచేస్తుంది. నరాలకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడానికి పారిజాతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని కోసం 4 పారిజాతం ఆకులను తీసుకోని 250 ml నీటిలో వేసి 200 ml అయ్యేవరకు మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని ఉదయం సమయంలో తాగాలి.

మెంతులను మొలకలుగా చేసుకొని ఒక స్పూన్ మొలకలను వారంలో 4 సార్లు తినాలి. మెంతులను తినకూడదు. కేవలం మొలకెత్తిన మెంతులను మాత్రమే. తీసుకోవాలి. ఇలా 2 వారాల పాటు చేస్తే సయాటికా నొప్పి, నరాలలో సమస్యలు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు తగ్గటమే కాకుండా అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది.కిడ్నీ పనితీరు సామర్ధ్యం కూడా పెరుగుతుంది.