కరోనా సమయంలో ఉల్లిపాయ తింటున్నారా…ఊహించని లాభాలు ఎన్నో
onion Benefits in Telugu :కరోనా సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటించాలి. కొన్ని ఆహారాలను తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. అలా శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగితే మన శరీరం వైరస్ బారి నుండి తట్టుకొనే శక్తి కలిగి ఉంటుంది. అలాంటి ఆహారాలలో ఉల్లిపాయ ఒకటి.
ఉల్లిపాయను ఆహారంలో బాగంగా చేసుకుంటే కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. ఉల్లిపాయలో మినిరల్ (క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, సెలీనియం మరియు ఫాస్పరస్)పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులకు ఉపశమనం కలిగిస్తాయి.
ఉల్లిపాయ రసం మరియు తేనె రెండింటిని సమభాగంలో తీసుకొని రెండూ బాగా మిక్స్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుంచి ఉల్లి గడ్డలు కాపాడతాయి. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
ఉల్లిలోని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుంచి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తిన్నట్లయితే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిపాయ శరీరంలో రక్తం పల్చగా ఉండి కణాలన్నీ ప్రసరించేందుకు ఉపయోగపడుతుంది. అంతే కాదు రక్తం గడ్డ కట్టకుండా రక్త కణాలు నుండి ఎర్ర రక్త కణాలను నిరోధిస్తుంది.