రోగనిరోధక శక్తిని పెంచే మిరియాల టీ…నిజం తెలుసుకోండి
pepper Tea Benefits In telugu : మిరియాలను మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈ రోజు మిరియాల టీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకొని ఆ తర్వాత ఇతర ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం.
ప్రతి రోజు మనం తాగే టీలో నల్ల మిరియాల పొడి వేసి మరిగిస్తే మిరియాల టీ రెడీ అవుతుంది. ఈ టీ తాగితే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి వైరస్ దాడి జరగకుండా ఉంటుంది. రక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచటమే కాకుండా బరువు తగ్గటానికి సహాయాపడుతుంది. జీర్ణ క్రియలు బాగా జరిగేలా చేసి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.
దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దంత వ్యాధులు రాకుండా చూస్తుంది. డయేరియా, గుండె జబ్బులకు విరోధిగా పనిచేస్తుంది.యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వైరస్లు, బ్యాక్టీరియాతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది.
రోగ నిరోధక వ్యవస్థను గాడిలో పెడుతుంది. క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉన్నాయి.చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి మిరియాల టీలో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలో నిత్యం ఏర్పడే ఒత్తిడిని తగ్గించి శరీరానికి విశ్రాంతినివ్వడంలో ఇది అమోఘంగా పనిచేస్తుంది.