MoviesTollywood news in telugu

దంగల్ సినిమాలో కేవలం ఒక్క సీన్ కోసం ఎన్ని నెలలు కష్టపడిందో..?

Dangal Movie sanya malhothra : ఒక్కో సినిమాలో ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. అనుకున్న ప్రకారం సీన్ రావడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఇందుకు హోమ్ వర్క్ కూడా గట్టిగానే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాలు చేసి, ఇప్పుడు హిట్ కోసం చూస్తున్న సన్యా మల్హోత్రా తన తొలి సినిమాలో ఒక్క సీన్ కోసం ఏకంగా 10 మాసాలు కష్టపడింది.

ఈ విషయాన్ని సన్యా మల్హోత్రా ఓ ఇంటర్యూలో తాజాగా వెల్లడించింది. శకుంతలాదేవి, ఫొటోగ్రాఫ్, బధై హో మూవీస్ చేసి ప్రస్తుతం ఓ తెలుగు హిట్ మూవీకి రీమేక్ గా తీస్తున్న హిందీ మూవీలో చేస్తోంది. అయితే ఈమె తొలిసినిమా దంగల్. రెజ్లింగ్ కాన్సప్ట్ తో చేసిన ఈ సినిమాలో అందరూ బాగా నటించడంతో మంచి హిట్ అయింది.

రెజ్లర్ పాత్రల్లో చాలామంది నటించి తమ సత్తా చాటారు. అయితే ఒక సీన్ లో సన్యా మల్హోత్రా నిజంగానే రెజ్లర్ గా పోటీ పడాల్సి వస్తుంది. ఈ సీన్ కేవలం ఒక నిమిషం నిడివి మాత్రమే ఉంటుంది. అయితే బాగా చేయాలన్న తపనతో 10మాసాలు కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. తొలిసినిమా కావడంతో తానేమిటో నిరూపించుకునే ఛాన్స్ వచ్చిందని భావించి కష్టపడ్డానని చెప్పింది.