శేఖర్ మాస్టర్ కంపోజ్ కి ధీటుగా బన్నీ డాన్స్
Sekhar Master Allu Arjun Combination Songs : సినిమాల్లో పాటలు, ఫైట్స్ ఉండాలి. ఇక ఆ పాటకు స్టెప్పులు ఉంటె అదుర్స్. అందుకే ఒకప్పుడు అంతంత మాత్రమే ప్రాధాన్యత గల డాన్స్ మాస్టర్లకు ఇప్పుడు గిరాకీ ఎక్కువగానే ఉంది. పైగా యంగ్ హీరోలందరూ డాన్స్ మీద దృష్టి పెడుతున్నారు. ఇండస్ట్రీకి కొత్త కొత్త డాన్సర్స్ వస్తున్నారు. అలాగే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కి మంచి డిమాండ్ ఉంది.
ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వేసే స్టెప్పులకు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తే ఇక చూడక్కర్లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త స్టెప్పులను శేఖర్ మాస్టర్ పరిచయం చేస్తూ ఉంటాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాల్లో జులాయి మూవీలో నేనేడ పుడితే నీకేంటి అమ్మాయి సాంగ్ కి శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన తొలిపాట. ఇద్దరమ్మాయిలు మూవీలో టాప్ లేచిపోద్ది అనే హుషారైన గీతంలో చేసే డాన్స్ ఫాన్స్ కి కిక్కిస్తుంది.
సన్నాఫ్ సత్యమూర్తి మూవీ నుంచి సూపర్ మచ్చి సాంగ్ కి శేఖర్ మాస్టర్ కంపోజ్ కి ధీటుగా బన్నీ స్టెప్పులేశాడు. సరైనోడు మూవీలో బ్లాక్ బస్టర్ అనే సాంగ్, దువ్వాడ జగన్నాధంలో సిటీ మార్ సాంగ్, అలవైకుంఠపురంలో మూవీలో రాములో రాములో సాంగ్ కూడా వీరిద్దరి కాంబోలో వచ్చి అదరగొట్టేశాయి. తాజాగా పుష్ప మూవీలో సామి సామి సాంగ్ దుమ్మురేపింది.