కొత్త కారు కొన్న ఆది సాయి కుమార్…ఖరీదు ఎంత అంటే…
Aadi Saikumar New Car : హీరోగా,విలన్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, బుల్లితెర హోస్ట్ గా తనదైన ముద్ర వేసుకున్న సాయికుమార్ అందరిలాగానే వారసుడిగా తన కొడుకుని దించారు. ఆది సాయికుమార్ పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఆది నటించిన అతిధి దేవో భవ మూవీ రిలీజయింది. అయితే ఆది సినిమాలు అనుకున్నంతగా సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ సాధించడంలేదు.
కథల విషయంలో జాగ్రత్త తీసుకుంటే సక్సెస్ అందుకుంటాడని టాక్. తాజాగా అతడు కొన్న కారుతో ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో జోడించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. బుల్లితెర మీద ఆది సినిమాలకు డిమాండ్ ఉంది. అందుకే సాటిలైట్ హక్కులకు బాగానే సొమ్ములు వస్తున్నాయట. ఇక తాజాగా కొన్న కారు ఖరీదు చూస్తే 50 లక్షల రూపాయల పైమాటే అని టాక్.