బొబ్బిలి సింహం మూవీకి పోటీ ఇచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటో…?
Bobbili Simham Movie : నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన మీనా, రోజా నటించిన బొబ్బిలి సింహం మూవీ అప్పట్లో సూపర్ హిట్. ఏ కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎం ఎం కీరవాణి సంగీతం అదనపు ఆకర్షణ. 1994సెప్టెంబర్ 24న విడుదలైన ఈ మూవీ 7కోట్ల షేర్ తెచ్చింది. 60సెంటర్స్ లో 50రోజులు, 15సెంటర్స్ లో 100డేస్ ఆడింది.
ఈ మూవీకి ఏడు రోజుల ముందుగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటించిన అల్లరోడు రిలీజయింది. కె అజయ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీ కామెడీకి పెద్ద పీట వేసినప్పటికీ అలరించలేకపోయింది. ఇక సెప్టెంబర్ 30న ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వచ్చిన శుభలగ్నం మూవీ బ్లాక్ బస్టర్ అయింది. జగపతి బాబు, ఆమని, రోజా నటించిన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.
ఇక బొబ్బిలి సింహం వచ్చిన 8రోజులకు సుమన్, రంభ జంటగా నటించిన హలో అల్లుడు మూవీ వచ్చింది. వాణిశ్రీ అత్తగా నటించిన ఈ మూవీ ఏవరేజ్ అయింది. విక్టరీ వెంకటేష్, రంభ, రమ్యకృష్ణ నటించిన ముద్దుల ప్రియుడు మూవీని కె రాఘవేంద్రరావు తెరకెక్కించారు. అయితే ఇది ప్లాప్ అయింది.