Healthhealth tips in telugu

పండ్లు, కూరగాయలను శానిటైజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా ?

Fruits and vegetables sanitize :కరోనా కారణంగా మనం చాలా విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. బయటి నుంచి ఏ వస్తువు ఇంటికి తీసుకొచ్చిన ఒకటికి రెండుసార్లు కడిగి శానిటైజ్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలో చాలామంది కూరగాయలను పండ్లను కూడా శానిటైజర్ చేస్తున్నారు.

అయితే ఈ విధంగా శానిటైజ్ చేయటం వల్ల…శానిటైజ్ లో ఉండే ఆల్కహాల్ పండ్లు కూరగాయల్లోని పోషకాలను నశింపజేస్తుందని…అందువల్ల శానిటైజ్ చేయకుండా ఇప్పుడు చెప్పే పద్ధతి పాటించాలని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలను పండ్లను ఉప్పు నీటిలో కడిగి తుడుచుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే మనలో చాలామంది పండ్లను కూరగాయలను డిటర్జెంట్ కలిపిన నీళ్ళతో అడుగుతున్నారు. అలా కడగటం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సరిగా శుభ్రం చేయకపోతే.. కరోనా వైరస్ ఏమో గానీ, ఇతర ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పక వస్తాయని అంటున్నారు.

సో.. పండ్లు, కూరగాయలు శుభ్రం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేసుకొని తీసుకోవాలి. ఈ సమయంలో మనకుండా తప్పనిసరిగా తినవలసిన అవసరం ఎంతైనా ఉంది.