కరోనా సమయంలో వేపాకు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా…నిజం ఎంత…?
Neem Leaves benefits In Telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో శరీరంలో రోగనిరోదక శక్తి పెంచుకోవాలి. కరోనాతో పోరాటం చేయాలంటే వేపాకు తీసుకోవాలని అంటున్నారు. అలాగే వైరస్ ని అంతం చేయటానికి వేపాకులో ఉన్న లక్షణాలు సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాక డయబెటిస్ ఉన్నవారికి కరోనా సమయంలో చాలా బాగా సహాయపడుతుంది.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనిషిని ఎన్నో రకాల సమస్యలు వేధిస్తున్నాయి. వాటిలో డయాబెటిస్ ఒకటి. ఒకప్పుడు 50 ఏళ్ళు వచ్చాక వచ్చేది. ఇప్పటి రోజుల్లో చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. డయాబెటిస్ వచ్చిందంటే తప్పనిసరిగా మందులు వేసుకోవాలి. ఆలా మందులు వాడుతూ ఇంటి చిట్కాలను పాటిస్తే నియంత్రణలో ఉంటుంది.
ఈ వ్యాధిని మనము కొంతవరకు తగ్గించుకోవడానికి వేప ఆకులు, వేప బెరడు, వేప పువ్వులు, వేప నూనె కొంతవరకూ వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. వేప ఆకులు వ్యాధి వేగముగా పెరగకుండా చేయగలదని ఇటీవల జరిగిన పరిశోధనలో తేలింది. వేప ఆకులతో వేప షర్బత్ తయారుచేసుకొని తాగితే, డయాబెటిస్ చాలావరకూ కంట్రోల్ లో ఉంటుంది.
లేకపోతే ప్రతి ఉదయము కొన్ని లేత వేప ఆకులను నమిలినా మంచి ప్రయోజనం ఉంటుంది. వేపాకులలో యాంటీ వైరల్ గుణాలు డయాబెటిస్ కంట్రోల్ లో ఉండేలా చేస్తుంది. వేప షర్బత్ కోసం ఓ 20 వేపాకులను తీసుకుని ఒక పాత్రలో వేసి ఒక గ్లాసు నీరు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి.అప్పుడు ఆ నీరు ఆకుపచ్చ రంగు లోకి వచ్చిన తర్వాత, ఆ నీటిని వడగట్టి చల్లార్చి… రోజుకు రెండు సార్లు తాగితే చాలావరకూ డయాబెటిస్ వ్యాధిని అరికట్టడానికి వీలుపడుతుంది.