Healthhealth tips in telugu

3 రోజులు-ఊపిరితిత్తులు శుభ్రం అయ్యి పెరుకున్న కఫము, నిమ్ము తగ్గి దగ్గు, ఇన్ ఫెక్షన్ ఉండవు

Chest Congestion : ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా మందిని దగ్గు,జలుబు వంటి సమస్యలు వేదిస్తున్నాయి. ఈ చలికాలంలో శ్వాస కోశ స‌మ‌స్య‌లు కూడా ఎక్కువ అవుతాయి. ఈ సమస్య ఉన్నవారిలో ఛాతిలో క‌ఫం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక దాన్ని తొల‌గించి ఊపిరితిత్తుల‌ను శుభ్రం చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.
lungs
దీని కోసం ఒక డ్రింక్ తయారుచేసుకోవాలి. పది నుంచి పదిహేను పుదీనా ఆకులను శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఈ పుదీనా ఆకులలో అంగుళం అల్లం ముక్క వేసి మెత్తగా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు గ్లాసుల నీటిని పోసి పుదీనా,అల్లం పేస్ట్ వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత పావు స్పూన్ పసుపు వేయాలి.

రెండు నిమిషాలు అయ్యాక ఈ నీటిని గ్లాసులోకి వడకట్టాలి. దీనిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి.
ఈ విధంగా 3 రోజుల పాటు చేస్తే ఊపిరితిత్తులలో కఫం, నిమ్ము వంటి సమస్యలు తగ్గటమే కాకుండా దగ్గు,జలుబు,గొంతు ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

పుదీనా, అల్లం, పసుపులో ఉన్న గుణాలు ఈ చలికాలంలో వచ్చే అన్నీ రకాల సమస్యలను తగ్గించటమే కాకుండా శరీరంలో రోగనిరోదకశక్తిని పెంచుతుంది. అలాగే ఈ డ్రింక్ ని అన్నీ వయస్సులవారు తాగవచ్చు. చిన్న పిల్లలు అయితే అరగ్లాసు, పెద్దవారైతే ఒక గ్లాస్ తాగవచ్చు. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.