Healthhealth tips in telugu

రాత్రి మిగిలిన అన్నం మరుసటి రోజు తింటే ఏమి అవుతుందో తెలుసా?

Left Over Rice : సాదరణంగా ప్రతి ఇంటిలో రాత్రి సమయంలో వండిన అన్నం మిగులుతుంది. ఆ అన్నాన్ని మరుసటి రోజు తింటూ ఉంటారు. అలా అన్నం తినటం వలన ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. రాత్రి వండిన అన్నం ఉదయం అంటే దాదాపుగా పది గంటల పాటు అలా ఉంటే ఆ అన్నంలో బాక్టీరియా ఫామ్ అవుతుంది.

ఆ బాక్టీరియా ఉన్న అన్నాన్ని తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. అయితే అన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అవుతుందని కాదు…అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంటగది ఉష్ణోగ్రత పెరిగితే.. బాక్టీరియా ఎక్కువగా తయారవుతుందట. దాని వల్ల.. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.

చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి.. అన్నం వండగానే..మూడు లేదా నాలుగు గంటల లోపు తినేయాలి. అన్నంను చాలా మంది వేడి చేసి తింటూ ఉంటారు. ఒకసారి అన్నాన్ని వండాక.. మళ్లీ వేడి చేయకూడదు. ఇవన్నీ బాధలు పడే బదులు.. ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వేడి వేడిగా వండుకొని తింటే మంచిది. ఎటువంటి సమస్యలు ఉండవు.

ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం తప్పనిసరిగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మంచి పోషకాలు ఉన్న ఆహారంను కూడా తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా ఆరోగ్యకరమైన జీవన విధానం మంచిది.