ఈ రోటీలను తింటే నెలకు 5 కేజీల బరువు తగ్గడం ఖాయం
7 day diet plan for weight loss :ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అధిక బరువు సమస్య వేధిస్తోంది. అధిక బరువు తగ్గటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన పెద్దగా ప్రయోజనం కనబడదు. ఇప్పుడు చెప్పే రోట్టెలను తింటే నెలకు దాదాపుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు.
రాత్రి సమయంలో అన్నం తినడం మానేసి ఈ రొట్టెలు తింటే సరిపోతుంది. ఈ రొట్టెలు తయారు చేసుకోవటానికి ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ ఓట్స్, ఒక స్పూన్ తెల్ల నువ్వులు తీసుకొని నూనె లేకుండా మంచి వాసన వచ్చేవరకు వేగించి పొడి చేసుకుని ఉంచుకోవాలి. ఈ పొడిని ఎక్కువగా తయారుచేసుకొని నిల్వ చేసుకోవచ్చు.
ఈ పొడిని ఒక కప్పు గోధుమపిండిలో కలిపి నీటిని పోస్తూ చపాతీ పిండిలా కలుపుకుని రొట్టెలు తయారు చేసుకొని నూనె లేకుండా కాల్చుకుని తినాలి. రోజుకు రెండు రొట్టెలు తింటే సరిపోతుంది. ప్రతిరోజు ఈ రొట్టెలను తింటూ పావు గంట వ్యాయామం చేస్తే కచ్చితంగా నెల రోజుల్లో దాదాపుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు..
ఆవిసే గింజలు, ఓట్స్, తెల్ల నువ్వులలో ఉండే పోషకాలు బరువు తగ్గించటానికి, శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయ పడుతుంది. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. ఒక్కసారిగా పెరిగిపోకూడదు. అలా అని ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఇలా చపాతీ తయారుచేసుకొని తింటే మంచి ఫలితం కనపడుతుంది.