బొడ్డులో నూనె వేసి మసాజ్ చేస్తే…ఆ సమస్యలన్నీ పోతాయి..!
Belly Button Oiling : బొడ్డులో నూనె వేసి మసాజ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బొడ్డులో నూనె వేసి కొంత సేపు మర్దనా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. బొడ్డు మన శరీరంలో 72వేల సిరల ద్వారా ప్రతి అవయవానికి అనుసంధానమై ఉంటుంది. అందువల్ల బొడ్డులో నూనె వేసి చికిత్స చేస్తే నరాల చివరలు ఉత్తేజంగా మారుతాయి.
ఆముదంతో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు, నరాల మంట, గొంతు కండరాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి అన్నీ రకాల నొప్పులు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఆలివ్ ఆయిల్ లో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్దిగా ఉండుట వలన నొప్పులను తగ్గిస్తుంది.
ఆవనూనెతో మసాజ్ చేస్తే నొప్పులు తగ్గుతాయి. ఆవనూనెలో అల్లైల్ ఐసోథియోసైనేట్ అనే సమ్మేళనం ఉండటం వలన శరీరంలోని కొన్ని నొప్పి గ్రాహకాలను డీసెన్సిటైజ్ చేసి నొప్పులను తగ్గించటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ నూనెలో ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం ఉండుట వలన వాపు, మంటలను తగ్గించటంలో సహాయపడతాయి.
అయితే నూనెతో మసాజ్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బొడ్డులో కేవలం 3 చుక్కల నూనెను మాత్రమే వేయాలి. 10 నుంచి 15 నిమిషాలు చాలా నిదానంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే సరిపోతుంది. రాత్రి సమయంలో మసాజ్ చేస్తే ఉదయం లేవగానే.. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఎటువంటి టెన్షన్స్ ఉన్నా మటుమాయం అవుతాయి.