Healthhealth tips in telugu

వ్యాయామం కొరకు సైకిల్ తొక్కితే ఏమి అవుతుందో తెలుసా ?

అధిక బరువుతో బాధపడేవారి వారి కోసం సైక్లింగ్ మంచి వ్యాయామం. ఇంట్లో ఉండి చేయగలిగిన వ్యాయామాలలో సైక్లింగ్ గురించి ప్రదానంగా చెప్పుకోవాలి. సైక్లింగ్ వలన బరువు తగ్గుతారనే విషయం అందరికి తెలుసు. అయితే సైక్లింగ్ వలన ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయి? ఎంత సమయం చేయాలి. అలాగే దాని గురించి జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి.
bike
సైక్లింగ్ ఎందుకు చేయాలి
ఒక పౌండ్ బరువు తగ్గాలంటే సుమారు 3500 కేలరీలు కరిగించుకోవాలి. ఇతర వ్యాయామాల వలన ఇన్ని కేలరీలు తగ్గించుకోవాలంటే చాలా ఎక్కువ సమయం పడుతుంది. అదే సైక్లింగ్ లో అయితే చాలా త్వరగా కేలరీలను కరిగించుకోవచ్చు.
bike
ఎంత సేపు తొక్కాలి
ఒక గంటసేపు సైకిల్ తొక్కితే సుమారు 300 నుంచి 400 కేలరీలు ఖర్చు అవుతాయి. వారంలో కనీసం 4 గంటల నుండి 7 గంటల వరకు సైకిల్ తొక్కగల్గితే చాలా తక్కువ సమయంలో అధిక బరువును అంటే దాదాపు ఒక పౌండ్ బరువు తగ్గవచ్చు.
bike excercise
జాగ్రత్తలు
బయట సైకిల్ తొక్కేవారు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగుడు దిగుడు దారిలో కాకుండా సాఫీగా ఉన్న దారిలో సైకిల్ తొక్కాలి. సైకిల్ తోక్కేతప్పుడు అనువైన బూట్లు మరియు దుస్తులు ధరించాలి. సైకిల్ తొక్కటం వలన బరువు తగ్గటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Immunity foods
రోగనిరోధకశక్తి
శరీరంలో రోగనిరోధకశక్తి చాలా ముఖ్యమైనది. ఇది తగ్గితే అన్ని రకాల వ్యాదులు చుట్టుముట్టే అవకాశం ఉంది. రోజు ఒక గంట సైకిల్ తొక్కటం వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. తద్వారా వ్యాదులు దరిచేరవు.

కండరాలు
కండరాలు బలంగా,ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కదలికలు సక్రమంగా ఉంటాయి. కండరాలను ఆరోగ్యంగా ఉంచటానికి సైక్లింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వయస్సు పెరిగే కొద్ది కండరాలు బలహీనం అవుతాయి. వీటిని బలోపేతం చేయటానికి సైక్లింగ్ మందుగా పనిచేస్తుంది.

గుండె
ఎరోబిక్స్ వ్యాయామాలలో సైక్లింగ్ గురించే చెప్పుకోవాలి. గుండె నొప్పి రాకుండా కాపాడటమే కాకుండా అధిక రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. గుండెకు సంబందించిన ఇతర సమస్యలు రాకుండా చూస్తుంది.

మానసిక ఒత్తిడి
సైక్లింగ్ అనేది శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. శారీరక,మానసిక ఒత్తిడులను అదికమించతనికి సైక్లింగ్ బాగా పనిచేస్తుంది.