Healthhealth tips in telugu

Computer ముందు కూర్చొని పని చేసే వారి కోసం కొన్ని వ్యాయామాలు

Exercises for Computer Users : వ్యాయామం అనేది చక్కని శరీరాకృతికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా అవసరమని నిపుణులు చెప్పుతూ ఉన్నా చాలా మంది దీని కోసం సమయం కేటాయించలేకపొతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నవారు గంటల తరబడి కంప్యుటర్ ముందు కూర్చొని పనిచేయవలసి ఉంటుంది.

దీని కారణంగా వారు ఊబకాయంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే కొన్ని వ్యాయామాలు. ఉన్న చోటే కుర్చుని చేతులు,భుజాలు రెండింటిని గుండ్రంగా తిప్పండి. కుడి నుంచి ఎడమకు,ఎడమ నుంచి కుడికి రెండు,మూడు నిమిషాల పాటు చేయాలి. ఈ విధంగా ఏడు,ఎనిమిది సార్లు చేస్తే మంచిది.

కంప్యుటర్ ముందు టైపింగ్ చేసే సమయంలో శరీరంలో మిగతా భాగాల కన్నా చేతి వేళ్ళ మీద అధిక ఒత్తిడి ఉంటుంది. అరగంటకు ఒకసారి వాటికీ విశ్రాంతి ఇవ్వాలి. చేతి వేళ్ళను అటూ,ఇటు కదల్చటం,గుప్పిట మూసి తెరుస్తూ చేయటం చేయాలి. ఈ విధంగా వీలైనన్ని సార్లు చేయటం మంచిది.

చేతి వేళ్ళ తర్వాత అంత ఒత్తిడి,శ్రమకు గురయ్యేది కళ్ళు. వీలున్నప్పుడల్లా చల్లని నీటితో కళ్ళను తుడుచుకోవాలి. అదే విధంగా అరగంటకు ఒకసారి కూర్చున్న చోట నుండే కళ్ళు మూసుకొని వాటికీ కొంత విశ్రాంతి ఇవ్వాలి.

మీరు పనిచేసే సెక్షన్ మూడు లేదా నాలుగో అంతస్తులో ఉంటే లిఫ్ట్ ఉపయోగించకుండా ఉంటే మంచిది. పనిచేసే ఎనిమిది,తొమ్మిది గంటలలో కనీసం రెండు,మూడు సార్లు మెట్లు ఎక్కి దిగితే కాళ్ళకి మంచి వ్యాయామం అవుతుంది అంతేకాక క్యాలరీలు కూడా బాగా ఖర్చు అవుతాయి.

అదే పనిగా కూర్చోవటం వలన పాదాల మీద కూడా అధిక భారం పడుతుంది. ఉన్న చోటే నిల్చొని పాదాలు ఒక్కసారి గట్టిగా విదిలించాలి.

కూర్చున్న ప్రదేశంలో కాళ్ళను పారచాపుకుని రిలాక్స్ గా ఐదు నిముషాల పాటు కూర్చోవాలి. ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళ మీద భారం పడకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఏడు,ఎనిమిది సార్లు చేస్తే మంచిది.

నెక్ ఎక్సర్ సైజ్లు చాలా ముఖ్యమైనవి. పనిచేస్తూనే అప్పుడప్పుడు మెడను అటూ ఇటు,క్రిందికి పైకి తిప్పుతూ ఉండాలి. కాకపోతే నెక్ ఎక్సర్ సైజ్లు మాత్రం నిపుణుల సలహా మేరకు మాత్రమే చేయటం మంచిది.